IPL 2025 Mega Auction: ఈ బౌలర్లకు మెగా వేలంలో జాక్ పాట్.. భువీకి ఏకంగా..!
- కొనసాగుతున్న రెండో రోజు మెగా వేలం
- వేలంలో జాక్ పాట్ కొట్టిన భారత్ బౌలర్లు
- భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. కాగా.. రెండో రోజు వేలం ప్రారంభమైంది. అందులో భాగంగా.. మెగా వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. ముఖ్యంగా.. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువీపై ఎక్కువగా బిడ్ చేసింది. చాలా సీజన్లలో హైదరాబాద్‌కు ఆడిన భువనేశ్వర్‌ను ఆర్టీఎం ద్వారా తీసుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో.. ఈ సీజన్‌లో భువీ బెంగళూరుకు ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. భువనేశ్వర్ కుమార్ జాక్ పాట్ కొట్టాడు. గతంలో 4.2 కోట్లకు సన్ రైజర్స్ తీసుకోగా.. ఆర్సీబీ ఈసారి రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Read Also: Iran: నెతన్యాహును చంపేయండి.. ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అలాగే.. గత సీజన్‌లో సీఎస్కేకు ఆడిన తుషార్ దేశ్ పాండే ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడనున్నాడు. తుషార్ దేశ్ పాండేను రూ. 6.50 కోట్లకు ఆర్ఆర్ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ రూ. కోటి.. కాగా, అతని కోసం సీఎస్కే, రాజస్థాన్ పోటీ పడ్డాయి. మరోవైపు.. ఆర్టీఎం ద్వారా ముఖేష్ కుమార్ రూ.8 కోట్ల ధర పలికాడు. పేసర్ ముఖేష్ కుమార్ కోసం సీఎస్కే, పంజాబ్, ఢిల్లీ మధ్య వేలం జరిగింది. అలాగే.. దీపక్ చాహర్‌ను ముంబై భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 9.25 కోట్లకు సొంతం చేసుకుంది. చాహర్ కోసం చెన్నై, ముంబై మధ్య పోటీ సాగింది. యువ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.కోటి. అతని కోసం లక్నో, పంజాబ్ పోటీ పడ్డాయి. ఆర్టీఎం ద్వారా అతనిని తీసుకునేందుకు ఆర్సీబీ ఆసక్తి చూపలేదు.
Read Also: Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!