ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు… ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది. అయితే.. ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఆక్షన్ నిర్వహించే తేదీ, వేదిక గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ANI ప్రకారం.. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ చివరిలో రియాద్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగునున్నట్లు సమాచారం.
Lebanon-Israel War: హిజ్బుల్లా కమాండర్ అబూ అలీ సహా ఇద్దరు హమాస్ నేతలు హతం
కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర ఎక్కువ మనీ ఉంది. ఆ జట్టు వేలానికి ముందు ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే జట్టులో ఉంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయనుంది. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు వేలంలో అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఈ క్రమంలో.. అన్ని ఫ్రాంచైజీలు వీరి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి.
Supreme Court: నిషేధం ఉన్నప్పటికీ పటాకులు ఎలా కాల్చారు.. ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు
ఐపీఎల్ 2025లో 5 జట్లు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్నాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిటైన్ చేయబడిన 46 మంది ఆటగాళ్లలో 36 మంది భారతీయులు, 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరికి రూ.558.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించారు. అత్యధిక మొత్తంతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో హెన్రిచ్ క్లాసెన్, విరాట్ కోహ్లీ టాప్-2లో ఉన్నారు. క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్లకు, విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది.