బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్షాల సమావేశంలో 26 పార్టీలకు చెందిన 53 మంది నేతలు హాజరు అయ్యారు. రేపటి అజెండా 6 ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇది విపక్షాల పొత్తుల వారధిగా నిలువనుంది. కూటమి పరిణామాల గురించి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి పని చేస్తారు. కూటమి ఉమ్మడి కార్యక్రమాల ప్రణాళిక కోసం సబ్‌కమిటీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ ఈడీ వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు.
తనను కలవడానికి వచ్చిన మహిళా రైతులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉత్సాహంగా గడిపారు. వారితో కలిసి భోజనం చేసిన సోనియా.. అనంతరం వారితో కలిసి హుషారుగా డ్యాన్స్ కూడా చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం ఎన్‌డిఎ కుటుంబాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాలలోని చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే.. ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. రేపు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు.