ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈనెల 3న (ఆదివారం) ఎన్నికల ఫలితాలు రానుండగా.. మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే మరుసటి రోజే ఈ సమావేశం నిర్వహిస్తుండటంతో భేటీపై ఆసక్తి నెలకొంది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని అమరావతికి రానున్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై గందరగోళం మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈడీ సమన్లకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని తెలిపింది. అయితే సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరుకాలేదు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖండన, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధిపై తీర్మానాలు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా చర్చించామని లోకేశ్ తెలిపారు.
ఇవాళ్టి సమావేశం హిస్టారికల్ మీటింగ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
ఏపీ సచివాలయంలో ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం అయింది. ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు సాధికారిత కమిటీని జగన్ సర్కార్ నియమించింది. ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుల ఉన్నారు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.