జూలై 11వ తేదీన ఢిల్లీలో జీఎస్టీ 50వ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. ఈసారి ఆన్ లైన్ గేమింగ్ పై ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో హార్స్ రేస్‌లపై ట్యాక్స్‌కు ఆమోద ముద్ర వేయనుంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నేడు చైనాలో.. ఆ దేశ అధ్యక్షుడు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు.…
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు జే.ఏ.సి. అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లా వడ్లూరు, ఎల్లా రెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు సమావేశం కానున్నారు. ఈసమావేశానికి 7 ఏడు గ్రామాల రైతులు హాజరుకానున్నారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అగ్గిరాచుకుంటోంది. ఒకరినొకరు పోటాపోటీగా సమావేశాలకు ఏర్పటు చేస్తుకుంటున్నారు. శనివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి ఇటు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మద్దతుగా నిలిచిన తమ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పోటాపోటీ సమావేశాలతో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే వర్చువల్ మీట్ లో ద్వారా సీఎం మాట్లాడనున్న విషయం తెలిసిందే. అయితే…