G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది.
Pakistani Slogans In MP Asaduddin Owaisi Meeting:ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో కలకలం రేగింది. ఆయన సభలో ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో పాటు ఎంఐఎం అభ్యర్థి ఎండీ అబ్దుల్ మొబిన్ రిజ్వి, నిర్వాహకుడు ముజఫర్ హసన్ నురానీతో పాటు మరికొందరిపై పోలీసులు…
మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. చంద్రబాబుకు బుర్ర పాడైపోయిందా?.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగస్టు 31న ముంబయిలో ప్రతిపక్ష 'ఇండియా కూటమి' మూడో సమావేశం జరగనుంది. ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన భారత కూటమి.. మూడో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. సీట్ల పంపకాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరి సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా.. ఎంపీ రవిచంద్ర, కాంగ్రెస్ నేత వీహెచ్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బొంతు రామ్మోహన్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో 'రైతు గోస-బీజేపీ భరోసా' బహిరంగ నిర్వహిస్తుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, తమిళనాడులోని చెన్నై, ఢిల్లీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.