Sonia Gandhi: తనను కలవడానికి వచ్చిన మహిళా రైతులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉత్సాహంగా గడిపారు. వారితో కలిసి భోజనం చేసిన సోనియా.. అనంతరం వారితో కలిసి హుషారుగా డ్యాన్స్ కూడా చేశారు. హరియాణా మహిళా రైతులతో కలిసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా అక్కడ ఉంటం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించారు. హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి భోజనం చేసిన ఆమె.. ఆపై సరదాగా గడిపి చిందులేశారు.
Read also: EC Officers: అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్.. బూత్ స్థాయి అధికారులకు ట్రైనింగ్
ఈ నెల 8న రాహుల్‌గాంధీ హరియాణాలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడి రైతులతో కలిసి జన్‌కీ బాత్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన ట్రాక్టర్ నడిపి.. నాట్లు సైతం వేశారు. ఈ క్రమంలో అక్కడి కొందరు మహిళా రైతులు.. ఢిల్లీలోని రాహుల్ ఇంటిని చూడాలని ఉందని కోరారట. దాంతో రాహుల్ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని సోనియా నివాసానికి ఆహ్వానించారు. మహిళా రైతులను సోనియా కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి కాలుకదిపారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు పంచుకుంటూ…. ఇది స్వచ్ఛమైన సంతోషం అని రాసుకోచ్చారు. కాంగ్రెస్ నేత రుచిరా చతుర్వేది తన ట్విటర్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ఎలా ఉన్నారంటూ?..’ వాళ్లను రాహుల్ పలకరించడం.. సోనియా, రాహుల్, ప్రియాంక.. ముగ్గురూ వాళ్లతో భోజనం చేయడం, ప్రియాంకను వాళ్లు హత్తుకోవడం, ఇద్దరు మహిళా రైతులు ఆమె చేతుల్ని పట్టుకుని నృత్యం చేయాలని ముందుకు తేవడం, ఆమె సంతోషంగా చిందులేయడం అందులో చూడొచ్చు. స్వచ్ఛమైన ఆనందం అంటూ ఆ వీడియోను రుచిర పోస్ట్ చేశారు.
Read also: Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
హరియాణాలో రైతులతో సమావేశమైన వీడియోను రాహుల్‌గాంధీ పంచుకున్నారు. ‘మన దేశంలోని రైతులు ఎంతో నిజాయితీ, సున్నిత మనస్తత్వం కలిగిన వారు. వాళ్లు పడే కఠిన శ్రమ గురించి తెలుసు. వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటే, దేశంలోని ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు’ అని రాహుల్ పేర్కొన్నారు. వీడియోలో ఓ మహిళా రైతు.. ‘మేము దిల్లీలోని మీ ఇంటిని చూడాలనుకుంటున్నాం’ అని కోరారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ‘నాకు ఇల్లు లేదు.. ప్రభుత్వం నా ఇంటిని తీసుకుందని చెప్పారు. అనంతరం వారిని తన తల్లి సోనియా నివాసానికి ఆహ్వానించారు.
Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house.
But just see what happened next.
This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg
— Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023