Medak: నర్సాపూర్‌లో విషాదం.. తల్లి మందలించిందని కొడుకు ఘాతుకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: వినాయక చవితి రోజు ఓ బస్సు కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మందలించడంతో మనస్తాపం చెంది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది.
నర్సాపూర్‌కు చెందిన సాయితేజ(24) ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే తండ్రి చనిపోవడంతో సాయితేజకు తండ్రి ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు రెగ్యులర్ గా పనిచేసిన సాయితేజ మద్యానికి బానిసయ్యాడు. విపరీతంగా మద్యం సేవించి పనికి వెళ్లడం ప్రారంభించాడు. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో సాయితేజ తల్లి మందలించింది. తండ్రి చనిపోయినప్పటి నుంచి తీవ్ర విషాదంలో వెళ్లిన తల్లి కొడుకు ప్రవర్తనకు విషుగు చెందింది. విధులకు వెళ్లాలని మద్యానికి బానిసగా మారొద్దని చెప్పింది. ఈ వయసులో తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని గట్టిగా చెప్పింది. తనమీదే ఆశలన్నీ పెట్టుకుని బతుకుతున్నానని కన్నీరుమునీరుగా విలపించింది. ఇప్పటికైనా మారాలని విధులకు హాజరవ్వాలని కోరింది. కానీ తల్లి మాటలకు సాయితేజ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తను చనిపోతే తల్లి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించలేకపోయాడు. కోపంతో నర్సాపూర్ ఆర్టీసీ డిపో ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. డిపో భద్రతా సిబ్బంది గమనించి వెంటనే మంటలను ఆర్పారు. అనంతరం సాయితేజను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సాయితేజ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంత చిన్న విషయానికే ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో సాయితేజ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుటుంబానికి అండగా వుండాల్సిన కొడుకు చిన మాటతో తల్లినే వదిలేసి వెళ్లిపోయేందుకు సిద్దపడ్డాడేంటి అంటూ వాపోయింది.
Funny Case: కోసిగి పీఎస్‌లో విచిత్రమైన ఫిర్యాదు.. తలలు పట్టుకున్న పోలీసులు!
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!