Medak: గోరు చుట్టు పైన రోకలి పోటు అన్నట్టు.. అసలే ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. తండ్రి అస్థికలు కలపడానికి నీటి లోకి దిగిన అన్నదమ్ములు ఒకేసారి మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా లోని రాజంపేట మండలం లోని ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్ సింగ్ అన్నదమ్ములు. కొన్ని రోజుల క్రితం తండ్రి మరణించారు. ఈ నేపథ్యంలో తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు అన్నదమ్ములు మెదక్- కామారెడ్డి జిల్లాల సరిహద్దు లోని పోచారం ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అనంతరం అస్తికలు కలిపేందుకు నీటి లోకి దిగారు.
Read also:Vijayashanti: నోరు అదుపులో పెట్టుకోండి.. రాములమ్మ మాస్ వార్నింగ్..
కాగా ఆ సమయంలో నీటి ప్రవాహం ఉదృత అధికంగా ఉండడంతో అన్నదమ్ములు ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన మిగతావారు అలర్టై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు నీటిలో గాలించగా అప్పటికే అన్నదమ్ములు మరణించారు. కాగా పోలీసులు అన్నదమ్ముల మృతదేహాలను వెలికి తీశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం రోజుల వ్యవధి లోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం చాల బాధాకరం. ఈ ఘటన తో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.