తెలంగాణలో రెండు ఘటనలు రాజకీయంగా ప్రకంపనలు కలిగిస్తున్నాయి. భువనగిరిలో హోంగార్డు రామకృష్ణ కిడ్నాప్, హత్య కలకలం రేపగా.. కామారెడ్డిలో తల్లీ, కుమారుడు ఆత్మాహుతి కేసు. దీనిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని 306 సెక్షన్ కింద ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డిని నియమించారు. ఈ కేసులో ఏ-1గా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఏ-2గా సరాఫ్ యాదగిరి, ఏ-3 గా ఐరేని పృథ్వీగౌడ్, ఏ-4గా తోట కిరణ్‌ను చేర్చారు. ఏ-5 గా కన్నాపురం కృష్ణాగౌడ్, ఏ-6గా సరాఫ్ స్వరాజ్, ఏ-7గా సీఐ నాగార్జున గౌడ్ పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా పోలీసుల సమన్వయంతో కామారెడ్డి పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా వుంటే. రామాయంపేటకు చెందిన యువ వ్యాపార వేత్త గంగం సంతోశ్, అతని తల్లి గంగం పద్మల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ నేతలే కారణమని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామాయంపేట మున్సిపల్ ఛైర్మెన్ జితేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గంగం సంతోష్ తల్లి పద్మల ఆత్మహత్య కు పాల్పడడం చాలా బాధాకరం అన్నారు.
Read Also:Bv Raghavulu: బీజేపీకి ఆదరణ తగ్గుతోంది
సంతోష్ దగ్గర ఉన్న కాల్ డేటా ఇతర వివరాలు తెలపాలని జితేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. నా తప్పు ఉందంటే శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. నా ఇంటిపై దాడి చేయడం ఎంత వరకూ సమంజసం అన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులారా విచారణ చేయించండి. ఎటువంటి విచారణకైనా చేయండి నా తప్పు ఉంటే మెదక్ చౌరస్తాలో బలి దానానికి రెడీ గా ఉన్నా అని సవాల్ విసిరారు. సంతోష్ దగ్గర నాకు సంబంధించిన ఏవైనా ఆధారాలు అవి నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా బలి దానం చేస్తానన్నారు.