సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన వారే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలను తీసుకువచ్చినా.. ఈ లైంగిక దాడులు ఆగడం లేదు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లో కిరాయి ఉంటున్న మహిళపై లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. మెదక్ పాపన్నపేటలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం చేశాడు ఇంటి ఓనర్ కొడుకు. రాత్రి పిల్లలతో కలిసి ఇంట్లో పడుకున్న మహిళ.. భర్త డాబా పైన పడుకున్నాడని తలుపులు తీసి పడుకుంది. అయితే.. అర్థరాత్రి ఇంటి యజమాని కొడుకు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో పారిపోయాడు ఇంటి ఓనర్ కొడుకు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. ఒంటరిగా ఉన్న మహిళపై వీఆర్ఏ అత్యాచారయత్నం చేసిన ఘటన 18 Mar 2022న వరంగల్ జిల్లాలో జరిగింది. భార్య కేకలు విని అడ్డువచ్చిన భర్తని వీఆర్ఏ తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. రాయపర్తి మండలం కొండాపురం శివారు తండాకి చెందిన దంపతులు గ్రామంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి బిర్యాని సెంటర్‌కి వచ్చిన కొండాపురానికి చెందిన వీఆర్ఏ గాదె అశోక్ హోటల్ నిర్వాహకురాలిపై అత్యాచారానికి యత్నించాడు.
బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో వెంటనే భర్త అడ్డుపడ్డాడు. పెనుగులాడుకుంటున్న క్రమంలో బాధితురాలి భర్త వేలు నిందితుడి నోట్లో పడడంతో తెగిపడేలా కొరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
మృగాళ్లు రెచ్చిపోతున్నారు… నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని మహిళా సంఘాల నేతలంటున్నారు.
COVID 19: కరోనా సోకినవారిని పట్టేస్తున్న జాగిలాలు….!