బాయ్.. బాయ్.. అమ్మా స్కూల్ కి వెళ్లొస్తా.. అంటూ ఇంటి నుంచి వెళ్లారు ఆ చిన్నారు. జాగ్రత్త నాన్న అంటూ పంపించింది తల్లి. కానీ.. అదే చివరి చూపు అవుతుంది అనుకోలేదు ఆతల్లి. కాసేపటికే చిన్నారుల మృత్యువాత పడినట్లు తెలియగానే గుండెలు బాదుకుంటూ స్కూలు కు పరుగులు పెట్టింది. ఆచిన్నారులను చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆతల్లిని చూసిన వారందరికి కన్నీరు ఆగలేదు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ముగిశాక.. సమీపంలోని ఓ నీటిగుంత దగ్గరికెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత కలిచివేసింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంగోడుకు చెందిన మంగళి లాలయ్య, శేఖర్ అన్నదమ్ములు. వారి కుమారులు మంగళి అజయ్(9), మంగళి నర్సింహులు(9) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. బుధవారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మనోజ్ అనే స్నేహితునితో కలిసి న ర్సింహులు, అజయ్.. సమీపంలోని ఓ పొలంలో నీటి నిల్వ కోసం ఎక్స్‌కవేటర్‌తో తీసిన గుంత వద్దకు వెళ్లారు. అజయ్, నరసింహులు ప్రమాదవశాత్తు ఆ గుంతులో పడిపోగా, మనోజ్ స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం చెప్పాడు. వారంతా అక్కడికి చేరుకునేసరికి నర్సింహులు జాడ లేకపోగా, కొన ఊపిరితో ఉన్న అజయ్‌ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అజయ్ అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. కాగా, చిన్నారుల మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
CM Jagan: సీఎం జగన్ తిరుపతి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం