ఓ మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడో పై అధికారి.. ఆమెకు కావాల్సిన సంతకం పెడుతానన్నాడు.. కానీ.. ఓసారి మీ ఇంటికి వస్తా.. నా కోరిక తీర్చు అనడంతో ఖంగుతిన్న ఆమహిళ కొండంత బాధతో పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో మార్చి 30న జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘పని, బిల్లులిచ్చే విషయంలో నిన్ను ఏడాదికాలంగా ఇబ్బంది పెట్టాను. అదంతా మరిచిపో. నిన్ను ఉద్యోగంలో కొనసాగించే దస్త్రం మీద సంతకం చేస్తా. నువ్వు చేయాల్సిందల్లా.. నా కోరిక తీర్చడమే. అలా చేస్తే నీకు ఏ కష్టం రాకుండా మహారాణిలా చూసుకుంటా. ఉద్యోగ విధులుపెద్దగా లేకుండా చూస్తా’ అంటూ అధికారి అన్నట్లు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ ః
‘నేను ఒప్పంద పద్ధతిన సంక్షేమశాఖలో పనిచేస్తున్నా.. మమ్మల్ని కొనసాగించేలా ఏడాదికోసారి జిల్లా స్థాయిలో అధికారులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులు మమ్మల్ని కొనసాగిస్తారు. ఇదే విషయమై దస్త్రం మీద సంతకం చేయాలని విజ్ఞప్తి చేసేందుకు మరో మహిళా ఉద్యోగినితో కలిసి బాధితురాలు మార్చి 30న కార్యాలయానికి వెళ్లింది. అక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జయరాం నాయక్ తనతో.. మాట్లాడుతానని చెప్పి, నా సహోద్యోగిని ఆ అధికారి పంపించేశారు. డబ్బు అడుగుతారేమో అనుకున్నా. కానీ ఆయన నోటి నుంచి నేను ఊహించని మాటలు వచ్చాయి.
సంతకం పెడతా.. కానీ, రేపు ఉదయం ఒకసారి మీ ఇంటికి వస్తా. నా కోరిక తీర్చు అని మాట్లాడాడు. ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. సార్.. మీరు నా తండ్రిలాంటి వారు.. అలా మాట్లాడొద్దు అని బతిమిలాడా. అయినా అధికారి మాట వినలేదు. ఇలాంటివన్నీ ఆఫీసుల్లో మామూలు విషయాలే.. ఇలా ఉంటేనే అన్ని పనులూ జరుగుతాయి.. నువ్వేం కంగారుపడకు అంటూ పదే పదే అలాంటి మాటలతో నన్ను వేధించాడు. అక్కడ నుంచి బయట పడ్డ బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా అధికారులు పట్టించుకోలేదు.
దాంతో బాధితమహిళల మీడియాకు సమారం ఇచ్చింది. Ntv తో తన బాధను చెప్పుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జయరాం నాయక్ అనే అధికారి తనని వేధిస్తున్నాడని, తనతో గడపమన్నాడని బోరున ఏడ్చింది. అతడికి నా తండ్రి వయస్సు ఉంటుంది , మహిళల్ని రక్షించాల్సిన అధికారి ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉద్యోగం EXTEND కోసం వెళితే.. తనతో మాట్లాడాలని పక్కకు పిలిచాడని తెలిపింది. నేను డబ్బులు అడుగుతాడని అనుకున్న కానీ…నాతో గడపమన్నాడని కంటతడి పెట్టంది. తనతో పడుకుంటే డబ్బులు కూడా ఇస్తా అన్నాడని పేర్కొంది. పై అధికారులకు తనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. జయరాం కు రాజకీయ పలుకుబడి ఉందని, అందుకే ఇంకా అతనిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. జయరాంతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంది. దయచేసి నాకు న్యాయం చేయండని బోరున విలపించింది. జయరాంకి భయపడి సంగారెడ్డికి జాబ్ ట్రాన్స్ ఫర్ చేసుకున్నా అని , ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే ఎంతవరకైనా పోరాడతా’ అని బాధిత మహిళ వెల్లడించింది.
ఇక.. ఈ వ్యవహారం కాస్తా.. మీడియాలో ప్రసార కావడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం నాయక్ Ntvతో ఫోన్ లో మాట్లాడారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపాడు. తనకేమి తెలియదని, సఖి సెంటర్ నిర్వహిస్తున్న కైలాష్ అనే వ్యక్తే ఇదంతా చేయిస్తున్నాడని ఫోన్ లో వివరించాడు. తను మహిళతో అలా ప్రవర్తించలేదని పేర్కొన్నాడు. నా ఉద్యోగం పోవాలని వాళ్లు ప్లాన్ వేస్తున్నారని అన్నారు. నేను గిరిజన బిడ్డను, ఎవరికైనా సహాయం చేస్తాను తప్పా.. మహిళ జీవితాలతో ఆడుకునే మనస్తత్వం కాదని మీడియాకు ఫోన్ లో తెలిపాడు.