ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతన్నాయి. పోలింగ్ బూతులకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ భారీగా నమోదవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు సంగారెడ్డి జిల్లా 1. సంగారెడ్డిలో 61.13 శాతం పోలింగ్ నమోదు 2. పటాన్ చెరులో…
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రంగయ్యపల్లిలోని చెరువులో నలుగురు గల్లంతు అయ్యారు. చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు కాగా.. అతడిని కాపాడేందుకు ఒక మహిళ ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే సదరు మహిళ గల్లంతైంది.. ఇక, మరో ఇద్దరు మహిళలు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించి చెరువులో గల్లంతు అయ్యారు.
Medak: చేతబడి అనేది ఒక అద్భుత శక్తి.. మనుషుల గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఈ మంత్రాన్ని ఉపయోగించి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేసే అలవాటు ఉంది. కానీ చాలా మంది హేతువాదులు మాయ అనేదేమీ లేదని అంటున్నారు.
మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో భూవివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి.
KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మనోహరాబాద్‌లో రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో నిర్మించిన ఐటీసీ పరిశ్రమను ప్రారంభించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సెంటర్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో ఉన్న షాపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు 4 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్ జిల్లా శంకరంపేటలో 16.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.