కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతోంది. న రాహుల్ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ముగిసింది. నారాయణఖేడ్ బైపాస్ నుంచి మహాదేవ్ పల్లి వరకు యాత్ర చేశారు రాహుల్ గాంధీ. ప్రత్యేక వాహనంలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ కి వెళ్ళారు రాహుల్ గాంధీ. కామారెడ్డి జిల్లాకు చేరుకున్న భారత్ జోడో యాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజాంసాగర్ మండల్ వెలగనూరు వద్ద రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికాయి కాంగ్రెస్ శ్రేణులు. పెద్ద కొడపగల్ లో బస చేయనున్నారు రాహుల్ గాంధీ. సోమవారం జుక్కల్ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
Andhra Pradesh: అమ్మాయిలతో చిందులు.. టెక్కలి ఎస్‌ఐపై వేటు
మద్నూర్ మండలం మేనూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ లో సోమవారం తో ముగియనుంది భారత్ జోడో యాత్ర. రేపు రాత్రి సలాబత్ పూర్ వద్ద మహారాష్ట్రలో కి ప్రవేశించనుంది పాదయాత్ర. జోడో యాత్రకి మద్దతుగా ప్యారచుట్ పై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు. రాహుల్ గాంధీ ఫోటోతో గాల్లో విన్యాసాలు చేసిన యువకుడు. అందరినీ ఆకట్టుకున్నాడు. రాహుల్ యాత్రలో యువకుడి విన్యాసాలు వైరల్ అవుతున్నాయి. అసలేం జరుగుతోందో కొద్దిసేపు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత యువకుడిని చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రాహుల్ యాత్ర సందర్భంగా యువత, మహిళలు, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రాహుల్ తో కలిసి ఫోటోలు దిగుతున్నారు.
Read Also: Arvind Kejriwal: గుజరాత్ వంతెన దుర్ఘటన.. నిందితులను బీజేపీ కాపాడింది..