Fire Accident Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సెంటర్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో ఉన్న షాపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు 4 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన చేరుకున్న పోలీనులు మంటలను అదుపు చేసేందుకు నిమత్నంమయ్యారు. గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Fake Lawyers: న్యాయవ్యవస్థలో నకిలీలు.. ఫేక్ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చలామణి
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగడంతో షాపులు పక్క పక్కనే కావడంతో ఏకంగా నాలుగు షాపులకు మంటలు వ్యాపించాయని తెలిపారు. అయితే షాపుల్లో ఎవరు లేకపోవడంతో.. ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. షాపులో వున్న వస్తువులు అగ్ని ఆహుతయ్యాయని పేర్కొన్నారు. అయితే షాపులు పూర్తీగా దగ్దమవడంతో.. షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. షాపులో వున్న వస్తువులన్నీ తగలపడిపోవడంతో.. తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Fake Call: కృష్ణ ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్.. రైల్లో వున్న వ్యక్తే..