Land Dispute: మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో భూవివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఎకరం 20 కుంటల భూమి కోసం గత కొంత కాలంగా సత్యం, భిక్షపతి, శివరాం అనే అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు జరగుతున్నాయి. సోమవారం వరి కోయడానికి వచ్చిన సందర్భంలో శివరాంను మిగిలిన సోదరులు అడ్డుకున్నారు.
Read Also: Video: అకాల నష్టం.. ఎమ్మెల్యే కాళ్ల మీద పడి బోరున ఏడ్చిన మహిళా రైతు
ఈ క్రమంలోనే సోదరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలో శేఖర్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.