ధాన్యం కొనాలంటూ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళనకు దిగారు.ఆ దారిలో వెళుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు. రైతుల దగ్గరినుంచే అధికారులకు ఫోన్ చేశారు. కొనుగోలు కేంద్రాల వల్ల నిల్వ వుంచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ హామీతో ఆందోళన విరమించారు రైతులు. అంతుకుముందు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు. దీంతో…
రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ.. పవర్ రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..230 ఓట్లు మెదక్‌లో కాంగ్రెస్‌కు ఉన్నాయన్నారు. గెలిచే ఓట్లు లేకున్నా నా భార్యను పోటీలో నిలబెట్టానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టడం వల్లనే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరి రెండు ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రెండు…
అధికార పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారా?సొంత పార్టీకి చెందిన నాయకుడే…ఆ ఎమ్మెల్యే ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేశారా?ఈ వ్యవహారం పార్టీ పెద్దలు దృష్టికి చేరిన తరువాత…ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?పార్టీ ఆ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిందా? ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్‌కు రాజకీయంగా కీలకమైంది. టిఆర్ఎస్‌లో ప్రారంభం నుంచి ఉన్న నేత పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత…
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో.. కారుతో పాటు దగ్దమైన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో… వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, నోటిలో ఉన్న కృత్రిమ పళ్ల ద్వారా మృతుడు శ్రీనివాస్‌గా గుర్తించారు కుటుంబసభ్యులు. ఐతే…ఎక్కడో చంపేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసుల తెలిపారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్… ఇవాళ ప్రకటన ! అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు కారును…
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందరినీ కలుపుకొని పోకుండా.. సొంత కోటరీని ప్రమోట్ చేసుకుంటున్నారట. ఇంకేముందీ ఎమ్మెల్యేపై భగ్గుమనేవాళ్ల సంఖ్య పెరిగింది. వర్గాలు పుట్టుకొచ్చాయి. ఎవరి కుంపటి వారిదే. ప్రస్తుతం మూడు గ్రూపులు.. ఆరు తగాదాలుగా ఉందట అక్కడి టీఆర్‌ఎస్ పరిస్థితి. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మదన్‌రెడ్డికి బంధువులతో పొసగడం లేదా? మదన్‌రెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా.. సొంత పార్టీ నేతలే ఆయనపై ఒంటికాలిపై…
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. జిల్లాలోని తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు పొలం వద్ద కరెంట్ షాక్ తో చనిపోయాడు. అయితే, శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాశ్.. బాలుకు సకాలంలో పట్టాదార్ పాసుపుస్తకాలను ఇవ్వలేదని, దీంతో బాలుకు రైతు బీమా రాదని స్థానిక రైతులు ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ నిర్లక్యం వల్లనే ఇలా…
పీసీసీ పదవుల పందేరంలో ఆ జిల్లా నేతలకు ఎందుకంత ప్రాధాన్యం లభించింది? గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయినప్పటికీ వారికి కలిసొచ్చిన సమీకరణాలేంటి? ఇప్పటికైనా యాక్టివ్‌గా పనిచేస్తారా? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురికి పీసీసీలో కీలక పదవులు ఒకప్పుడు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకునేది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల…
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా రేపు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. ఉదయం 6 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిల..మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎల్దుర్తి మండలంలోని అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉద్యోగం రావట్లేదని…