రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మంజూరీ చేసినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్, ఐఎఫ్ఎస్ లేఖ రూపంలో తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు రానుందన్నారు.
Telangana Crime: ఇటీవలి వ్యక్తులు తమ కుటుంబాన్నే చంపుకుంటున్న సంఘటనలు కుటుంబ వ్యవస్థ ఉనికిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు..
మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం…
రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్‌లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట(మం) వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కాగా..…
బెట్టింగ్‌కు బానిసై కోట్లు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లిలో చోటుచేసుకుంది.
Atrocious: చిన్న వయస్సులో చదువుకుని, మంచి ఉద్యోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ.. కొందరు కుటుంబ పెద్దల తీసుకునే తెలివి తక్కువ నిర్ణయాలతో వారి బిడ్డలను దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
తూప్రాన్‌లో ఈ ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో భారీ ట్విస్ట్ బయటపడింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి యాదగిరి పారిపోయినట్లు తెలిసింది. ఈ నెల 5న కుటుంబంతో సహా యాదగిరి కనిపించకుండాపోవడంతో అతని వద్ద చిట్టీలు కట్టిన బాధితులు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.