బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే కాగా.. గత కొంత కాలంగా సర్వే నిర్వహించిన అధికారులు.. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు.. ఇవాళ మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు.. భూమి పంచనామా నిర్వహించారు.. మొత్తంగా అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నెంబర్లలో మొత్తం 84 ఎకరాల భూమి, హాకింపేట సర్వే…
మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఫోన్ కొనివ్వలేదని రామాయంపేట మండలం కోనాపూర్ ఊర చెరువులో దూకి విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.. నిన్ననే ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన శ్రావణి.. తనకు సెల్ ఫోన్ కొనివ్వమని తల్లిని అడగగా ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట వార్తలు వచ్చాయి.. కానీ, ఈ కేసులో శ్రావణి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.. Read Also: Revanth…
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని…
ప్రధాని నరేంద్ర మోదీకి మెదక్ జిల్లాకు చెందిన 200 మంది చిన్నారులు మూకుమ్మడిగా ఉత్తరాలు రాశారు. వివరాల్లోకి వెళ్తే… తాము చదవుకునేందుకు తమ జిల్లాలో నవోదయ పాఠశాల, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని చిన్నారులు ప్రధాని మోదీని కోరారు. తమ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉత్తరాలలో పేర్కొన్నారు. నవోదయ పాఠశాలలు ఉంటే తమ జీవితాలు బాగుపడుతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే.. కేవలం 10…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. మంగళవారం దీక్షలు, పాదయాత్ర, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలతో.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆమె… ఇక, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర వాయిదా పడిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్న ఆమె.. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. అందులో భాగంగా ఇవాళ రైతు…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా… ఆరింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయిందనే చెప్పాలి. అయితే మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఈరోజు జరిగిన…
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరోగ్య కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు వినూత్న ప్రచారం చేపట్టారు. కరోనా రెండు డోసుల టీకాలు తీసుకోకపోతే రేషన్, పెన్షన్ పంపిణీ నిలిపివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. Read Also: హైదరాబాద్‌లో మెగా…
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి…