Atrocious: మెదక్ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన చిన్న గాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: పిల్లలు ఆటలాడుకోవడం సహజం. అలానే కొంత మంది పిల్లలు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సరదాగా డాన్స్ కూడా చేస్తుంటారు. ఇలా ఆడుకునేటప్పుడో.. డాన్స్ వేసేటప్పుడో కింద పడిపోతూ ఉంటారు. అలా కింద పడినప్పుడు కొన్ని సార్లు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలను ఆ పిల్లలు గాని.. వాళ్ళ కుటుంబసభ్యులు గాని పెద్దగా పటించుకోరు. అయితే అలాంటి చిన్న గాయాలే కొన్నిసార్లు ప్రాణాలను కూడా హరిస్తాయి అనడానికి ఈ ఘటనే ఉందాహరణ. ఓ బాలుడుకి ప్రమాద వశాత్తు తగిలిన చిన్న గాయం ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జ్లిలా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Read also:Telangana Election 2023: నేటి నుంచి ఓటరు చీటీల పంపిణీ.. 23 వరకు కొనసాగునున్న ప్రక్రియ
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
మెదక్ జ్లిలా లోని పెద్దేముల్ గ్రామంలో ఓగుల రాజు, లక్ష్మి అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ప్రదీప్(11) స్థానిక ప్రైమరీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు.కాగా సెప్టెంబర్ 26 వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన శోభాయాత్ర సమయంలో ప్రదీప్ తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. ఈ నేపధ్యంలో స్నేహితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ప్రదీప్ కింద పడిపోయాడు. కిందపడిన సమయంలో ప్రదీప్ కి కడుపు భాగంలో గాయమైంది. అయితే ఆ గాయాన్ని కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. చిన్న గాయమేగా అని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించారు.
Read also:King Khans: ఈ ఖాన్స్ లేకుండా బాలీవుడ్ లేదు…
అయితే కొద్దిరోజుల తర్వాత ప్రదీప్ కడుపు నొప్పితో తరచూ బాధపడుతుండేవాడు. ఈక్రమంలో తాండూరు లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ప్రదీప్ కి కడుపు నొప్పి తగ్గలేదు. దీనితో ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రదీప్ ను పరీక్షించిన వైద్యులు కడుపులో లివర్‌తో పాటు పలు అవయవాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాగా ప్రదీప్ కి చికిత్స ను అందిచడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ చికిత్స అందుకుంటూ ఈనెల 13 వ తేదీ రాత్రి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!