మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రంగయ్యపల్లిలోని చెరువులో నలుగురు గల్లంతు అయ్యారు. చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు కాగా.. అతడిని కాపాడేందుకు ఒక మహిళ ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే సదరు మహిళ గల్లంతైంది.. ఇక, మరో ఇద్దరు మహిళలు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించి చెరువులో గల్లంతు అయ్యారు. దీంతో ముగ్గురు మహిళలు, ఒక బాబు మృతి చెందాడు. ముగ్గురు మహిళల మృతదేహాలను స్థానికులు వెలికి తీయగా.. చెరువులో గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Read Also: Vishwak Sen :ఆంజనేయ మాలలో విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..
మనోహరబాద్ మండలం రంగయ్యపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకేసారి నలుగురు మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక, ముగ్గురు మహిళల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవున్నారు. ఇక, బాబు మృతదేహం కోసం రంగంలోకి రెస్య్కూ టీమ్ దిగింది. స్థానిక పోలీసులు దగ్గర ఉండి మరి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.