ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. ఇక ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్‌ను నవంబర్ 17న పోలీసులు అరెస్ట్ చేశారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొట్టమొదటిగా ఏప్రిల్ 23న పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలు రద్దు చేసింది.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. "విజన్-2025" పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Minister KTR: జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ రైతులకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ 4 వేల ఇండ్లతో నిర్మించామని తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఇది కేవలం డ్రాప్ట్ నోటిఫికేషన్ మాత్రమే.. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదనేది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూ కుంభకోణంపై విచారణ చేపట్టాం అని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా అడ్డుకున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఎందుకు!? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
Bandi Sanjay: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల రైతుల ఉద్యమ స్ఫూర్తి కి ఆయన అభినందనలు తెలిపారు.
న్సిల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ లో రైతు జే.ఏ.సి. సంబరాలు చేసుకున్నారు. విలీన గ్రామాల రైతులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు అపోహ పడొద్దని సూచించారు. డ్రాఫ్ట్ లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమే, ఇదే ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు.