Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రెండు మున్సిపాల్టీలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్ ను రద్దు చేస్తూ పాలకవర్గాలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే.. కౌన్సిల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ లో రైతు జే.ఏ.సి. సంబరాలు చేసుకున్నారు. విలీన గ్రామాల రైతులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం రైతుల విజయమని రైతు జే.ఏ.సి. నాయకులు తెలిపారు. ఎన్టీవీతో రైతు జే.ఏ.సి. నేతలు మాట్లాడుతూ.. తమ ఐక్య ఉద్యమంతో సర్కారు దిగి వచ్చిందని అన్నారు. మున్సిపల్ సమావేశంలో తీర్మానం మా పోరాట ఫలితమే అన్నారు. అందరికి అనుకూలమైన మాస్టర్ ప్లాన్ మాత్రమే అమలు చేయాలని సూంచించారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం రైతుల విజయమే అన్నారు. మాస్టర్ ఫ్లాన్ పై తాత్కాలిక ఉపశమనం రైతులు వద్దు అంటున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలు కాదని, ముసాయిదా రద్దు అయినట్లు ప్రభుత్వం నుండి ప్రకటన కావాలన్నారు. మాస్టర్ ఫ్లాన్ పై వెనక్కి తగ్గేది లేదని రైతులు అన్నారని తెలిపారు.
Read also: Raghunandan Rao: సీఎస్‌కు రఘునందన్ రావు ఫోన్.. అపాయింట్ మెంట్ కావాలని..
మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ పై రైతులు నగల నుంచి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామన్నారు. మేం తీర్మానం చేసినది కాకుండా వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయని తెలిపారు. డిజైన్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానించామన్నారు. ప్రభుత్వానికి దీన్ని పంపిస్తామన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూడా చెప్పారని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతుల వెంటే మేముంటామన్నారు. బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమన్నారు. ఎవరికి అన్యాయం జరుగదన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. 60 రోజుల అభ్యంతరాలు తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీయల్ జోన్ చేయమని స్పష్టం చేశారు.
TSPSC AEE: ఏఈఈ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఆ టైం దాటిందో గేట్లు క్లోజ్