కామారెడ్డి జిల్లాలో నేడు మూడో రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టనున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి లో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటన పై ఉత్కంఠ కొనసాగుతుంది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనకు నిరసనగా రైతులు గురువారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. వీరితో పాటు వీడీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పనకు చర్యలు చేపట్టింది.. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు,…
దక్షిణకాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్నఆలయం అభివృద్ధిదిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన వేములవాడ రాజన్న ఆలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దిన అనంతరం అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు.. తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో మరికొన్ని దేవాలయాల అభివృద్ధిపై దృష్టిసారించారు సియం కేసీఆర్.. అందులో భాగంగా వేములవాడలో కొలువున్న శ్రీరాజరాజేశ్వరస్వామి…