మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఇది కేవలం డ్రాప్ట్ నోటిఫికేషన్ మాత్రమే.. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదనేది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ప్రజల అభ్యంతరాలను, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వమని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ ప్రార్థనలు, పూజలు
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రజలకు, రైతులకు వ్యతిరేఖంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాల నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. వారి మాటలు నమ్మి మీరు మోసపోవద్దు అని మంత్రి పేర్కొన్నారు. గతంలో చెప్పాం.. ఇప్పుడు కూడా చెప్పుతున్నాం.. ఏ ఒక్కరికి ఎలాంటి నష్టం జరుగకుండా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీక్ష చేస్తున్న రైతులకు వివరించారు. దీంతో మంత్రి హామి మేరకు దీక్షను విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.
Read Also: Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రాజకీయాలకు అతీతంగా దీక్ష చేస్తున్నామని, మంత్రి హామీతో తాము దీక్ష విరమించామని రైతులు వెల్లడించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. వాటిలో నిజం లేదని ఆయన పేర్కొన్నాడు. నాకు ఎక్కడ భూమి ఉందో ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి తెలిపారు. లేదంటే ఆరోపణలు చేసిన వారు ముక్కు నేలకు రాసి తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. నిజాయితీగా ఉన్నాము కాబట్టే మూడు దశాబ్ధాలకు పైగా ప్రజలు మమల్ని ఆదరిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.