మారుతి సుజుకి అనేక కార్ మోడల్స్, పవర్‌ట్రెయిన్ ఎంపికలతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. అయితే ఇప్పటి వరకు మారుతి ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయలేదు. ఇతర కంపెనీల నుండి చాలా ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ-విటారాను లాంచ్ చేయబోతున్నారు. 2025 సంవత్సరంలో ఇండియాలో ప్రారంభించనున్నారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ప్రముఖ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 7-సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది అంటే 2025 మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా వెబ్‌సైట్ gaadiwaadi కథనం ప్రకారం.. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ కారు భారత మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్…
మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌కు రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇది గతంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేశారు. దాని వివరాలను తెలుసుకుందాం.
Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్‌ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని…
ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్‌లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల మారవచ్చు.
నవంబర్ 2024 నెలలో, భారతదేశంలో హోల్‌సేల్ మార్కెట్‌లో 3,50,000 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే %. 4 శాతం పెరిగింది. మారుతీ సుజుకీ అత్యధిక కార్లను విక్రయించింది. హ్యుందాయ్ , టాటా మోటార్స్ 40,000 కంటే ఎక్కువ కార్లను విక్రయించాయి. టయోటా కిర్లోస్కర్ Sh. ఈ నెలలో 40కి పైగా కార్లు అమ్ముడయ్యాయి.
2024 Maruti Suzuki Dzire: మారుతి సుజుకీ డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్. ఇప్పుడు సరికొత్త లుక్‌లో రాబోతోంది. మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ డిజైర్‌ని నవంబర్ 11న రిలీజ్ కాబోతోంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ కార్లను మారుతి సుజుకి వెబ్‌సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా ప్రీబుక్ చేసుకోవచ్చు.
మంచి మైలేజీ కారణంగా మారుతి కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. అంతేకాకుండా.. వాటి నిర్వహణ, సరసమైన ధర కూడా బలమైన డిమాండ్‌కు పెద్ద కారణం. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడళ్లపై దృష్టి సారించింది.