ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్‌లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల ఉంటుంది.
మారుతీ ధరలను ఎందుకు పెంచుతోంది?
ఇన్‌పుట్ కాస్ట్, ఆపరేషనల్ ఖర్చులు పెరగడం వల్ల ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి తెలిపింది. తాము ఎల్లప్పుడూ వాహనాల ధరలను వీలైనంత తక్కువగా ఉంచడానికి ప్రయత్నిస్తామని కానీ.. పలు కారణాల వల్ల ఇప్పుడు పెంచక తప్పడం లేదని కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ పెరిగిన ధరలు మార్కెట్‌పై కొంత ప్రభావం చూపవచ్చని మారుతీ పేర్కొంది.
మారుతి యొక్క చౌకైన కారు ఎంత ఖరీదైనది?
మారుతి సుజుకి చెందిన చౌకైన కారు ఆల్టో K10. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ధర 4 శాతం పెరిగితే.. ఆల్టో బేస్ ధర దాదాపు రూ.16 వేలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీని టాప్ వేరియంట్ ధర రూ. 5.96 లక్షల నుంచి రూ.6.20 లక్షలుకు చేరుతుంది.
గ్రాండ్ విటారా ధర..
మారుతి గ్రాండ్ విటారా ఈ బ్రాండ్‌లో అత్యంత ఖరీదైన కారు. గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి మొదలై రూ. 20.09 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ధరను కూడా నాలుగు శాతం పెంచితే, దీని బేస్ మోడల్ ధర దాదాపు రూ.44 వేలు పెరిగే అవకాశం ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 80 వేల వరకు పెరిగే అవకాశం ఉంది.
మారుతి ఫ్రాంక్స్ ధర ఎంత?
మారుతీ ఫ్రాంటెక్స్ భారత మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కారు. ఈ మారుతి కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8,37,500 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ధర నాలుగు శాతం పెరిగితే.. కారు బేస్ వేరియంట్ ధర రూ.33,500 పెరగవచ్చు. ఫ్రాంటెక్స్ టాప్ మోడల్ ధర రూ.14.92 లక్షలు. జనవరిలో ఈ వేరియంట్ ధర రూ.60 వేల వరకు పెరిగే అవకాశం ఉంది.
మారుతి వ్యాగన్ఆర్..
మారుతీ వ్యాగన్‌ఆర్‌కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.54 లక్షల నుంచి మొదలై రూ. 7.33 లక్షల వరకు ఉంటుంది. కారు ధర నాలుగు శాతం పెరిగితే.. దాని బేస్ మోడల్ ధర దాదాపు రూ.22 నుంచి రూ.5.76 లక్షల వరకు పెరగవచ్చు. దీని టాప్ మోడల్ ధరలో దాదాపు రూ.29 వేలు పెరిగే.. రూ.7.62 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.