బాలీవుడ్ బ్యూటీ తాప్సీ విభిన్న కథలను ఎంచుకొంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా వుంది. ఇదిలావుంటే, తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై రీసెంట్‌గా తాప్సీ…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లికి సిద్దమయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సిద్దమైనపుడు కూడా ఎవరికి చెప్పలేదు. పెళ్లి సమయంలో ఆ యువతి ప్రేమించిన యువకుడితో చాటింగ్ చేసింది. పెళ్లిపీటలమీద నుంచి కూడా యువతి చాటింగ్ చేయడంతో అనుమానం వచ్చిన బంధువులు యువతి మొబైల్‌ఫోన్‌ను, పెళ్లి పందిరిలో అనుమానంగా కనిపించిన యువకుడిని పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి…
కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఓ మహిళా మృతి చెందింది. అంతేకాదు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్ లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో 16 మందికి తీవ్ర…
గతేడాది లాక్ డౌన్ లో రానా మొదలు చాలా మంది పెళ్లిల్లు చేసుకున్నారు. అదీ పెద్దగా సంకేతాలు ఏమీ ఇవ్వకుండానే! ఇలా అనౌన్స్ చేసి అలా మూడు ముళ్ల ముచ్చట తీర్చేసుకున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో అంతగా సెలబ్రిటీ మ్యారెజెస్ జరగటం లేదు కానీ… రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత తన రియల్ లైఫ్ హీరో చిటికెన వేలు పట్టేసుకుంది! చాలా లో ప్రొఫైల్ లో బెంగుళూరు బ్యూటీ పెళ్లి కానిచ్చేసింది!ప్రణీత సర్ ప్రైజ్…
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలో పెళ్లిచేసుకోనుంది. వీరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న ఈ జంట.. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కాగా జూలైలో దేశంలో కరోనా పరిస్థితులు అదుపులో వచ్చే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆ నెలలోనే వీరి వివాహం ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే…
కరోనా కాలంలో వివాహాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కొంత మంది ఆన్‌లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటే, మరికొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, తమిళనాడులోని మధురైకు చెందిన ఇద్దరు వ్యాపావేత్తల పిల్లల వివాహం విచిత్రంగా జరిగింది. మధురై నుంచి తుత్తుకూడి వరకు ఓ ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేసుకున్నారు. అందులో మొత్తం 161 మంది అతిధులు బయలుదేరారు. మధురై నుంచి విమానం బయలుదేరగానే వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టాడు. మధురై నుంచి…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఏ వ్యక్తికి ఎప్పుడు కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి బారినుంచి కోలుకుంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. పెళ్ళైనా వారు, పెళ్లి కానివారు, పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్దమైన వారు ఇలా ఎవర్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. మరో మూడు రోజుల్లో పెళ్లి ఉందని అనగా, పెళ్లి కుమారుడు కరోనాతో బలయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది. సాలూరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి…
కర్ణాటకలోని కోలార్‌లో అక్కాచెల్లెళ్లిద్దరినీ వివాహమాడి వార్తల్లోకెక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. కాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల…
రెండో ఎక్కం ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు. అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. …
బిల్ గేట్స్ దంపతులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాము విడిపోయినా, బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం విడిపోదని, ఇద్దరం కలిసి కట్టుగానే ఫౌండేషన్ ను నడిపిస్తామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేసిన తరువాత 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా…