ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ లేదు. అలాగని చేసుకోరని చెప్పలేము. కొన్ని కారణాల వలన విడిపోవచ్చు… తిరిగి కలుసుకోవచ్చు. ఎప్పుడో 2016లో యునితా రురీ అనే యువతిని అక్బర్ కొరిక్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏమయిందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే, అక్బర్ కొరిక్ కు ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన నూర్ ఖుస్నాల్ తో వివాహం నిశ్చయమైంది. ఈ…
వారిద్దరిదీ ఒకే గ్రామం… కాకపోతే వేరువేరు కులాలు. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. గ్రామం నుంచి ఢిల్లి వెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే, యువతి గర్భం దాల్చడంతో ఇద్దరూ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలోకి తిరిగి వచ్చిన వీరికి ఊహించని బహుమానం లభించింది. గ్రామంలోకి అడుగుపెట్టాలంటే పంచాయతీకి రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టాలని, జరిమానా కట్టకుంటే గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్చారు. యువకుడు లడ్డూసింగ్ తండ్రి యువతి…
కరోనా మహమ్మారి జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపాం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరికేవి. కానీ, ఇప్పుడు సాధ్యం కావడం…
జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి చిక్కుల్లో పడింది, తాజాగా ఆమె పెళ్లి విషయం వివాదంగా మారింది. 2007లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. కానీ ప్రియమణితో తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అతని మొదటి భార్య అయేషా ప్రకటించింది. అతను అధికారికంగా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. ముస్తాఫా మొదటి భార్య, ఆయేషా ఈ దంపతులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ప్రియమణి ముఖ్యాంశాల్లో నిలిచారు. మొదటి భార్యతో సెపరేట్ అయినప్పటికీ ఇంకా విడాకులు…
కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్లు అంటే హడావుడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సందడితో పాటుగా కొంత ఫన్ కూడా ఉంటుంది. కొంతమంది కావాలని వరుడు లేదా వధువును ఆట పట్టిస్తుంటారు. ఇలానే, ఓ పెళ్లిలో వరుడు పక్కన ఉండగానే ఓ యువకుడు వధువుకు ముద్దులు పెట్టాడు. పక్కనే ఉన్న వరుడు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అయితే, ఈ…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
పెళ్లిళ్లలో అలకలు, కొట్లాటలు, విసుగులు సహజమే. అమ్మాయి తరపువారిని ఇబ్బందులు పెట్టి కావాల్సిన చేయించుకుంటుంటారు. తప్పదని అమ్మాయి తరపు బంధువులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి కూరలు కూడా పెళ్లిళ్లలో కీలకంగా మారుతుంటాయి. పెద్ద గొడవలు సృష్టిస్తుంటాయి. పెళ్లిళ్లు రద్దు చేసుకునే వరకూ తీసుకెళ్తుంటాయి. ఇలాంటి సంఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. వివాహం సమయంలో ఏర్పాటు చేసిన విందులో మటన్ పెట్టలేదు. Read: బాసరలో అక్రమాలు..…
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది. పెట్రోల్‌ధరలకు భయపడి వాహనాలను బయటకు తేవడంలేదు. కొంతమంది పబ్లిక్ వాహనాలను వినియోగిస్తుంటే, మరికొందరు సంప్రదాయ వాహనాలను వినియోగిస్తున్నారు. గతంలో ఎలాగైతే రవాణాకోసం ఎడ్ల బండ్లను వినియోగించేవారో, ఇప్పుడు కొన్ని చోట్ల వాటిని తిరిగి వినియోగించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇలాంటి ఎడ్లబండిమీదనే వెళ్లేవారు. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మరలా ఎడ్లబండివైపు చూస్తున్నారు. Read: ‘తలైవి’కి తమిళంలో…
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకున్నారు. అంతేకాదు, పెళ్లి ఘనంగా చేస్తాం, పెళ్లికోసం 40వేల డాలర్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు. దీంతో పెళ్లికూతురు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంది. బడ్జెట్ వేసుకుంది. అయితే, చివరకు తల్లి వచ్చి బడ్జెన్ ను 20 వేలకు తగ్గించడంతో యువతి తల్లిదండ్రులపై అగ్గిమీద గుగ్గిలం అయింది. పెళ్లికి కనీసం 25వేల డాలర్లు ఖర్చు చేయాలని లేదంటే ప్రేమించిన యువకుడితో లేచిపోతానని బెదిరించింది. తల్లిదండ్రులే 40వేల డాలర్లు ఖర్చు…
తిరుపతిలో నిత్య పెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తాను అనాథనని నమ్మించిన ఓ యువతి ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుంది. ఇది వరకే ఆమె ఇద్దరిని పెళ్లి చేసుకుందనే విషయం తెలియక ఆమెను వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. కాగా ఆమె అతడి నుంచి ఆరు లక్షల వసూళ్ళు చేసి పరారైయింది. దీంతో మూడో పెళ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె బండారం బట్టబయలైంది. అయితే తాజాగా కొత్తగూడెంకు చెందిన వినయ్… తిరుపతిలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసి తాను…