ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకున్నారు. అంతేకాదు, పెళ్లి ఘనంగా చేస్తాం, పెళ్లికోసం 40వేల డాలర్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు. దీంతో పెళ్లికూతురు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంది. బడ్జెట్ వేసుకుంది. అయితే, చివరకు తల్లి వచ్చి బడ్జెన్ ను 20 వేలకు తగ్గించడంతో యువతి తల్లిదండ్రులపై అగ్గిమీద గుగ్గిలం అయింది. పెళ్లికి కనీసం 25వేల డాలర్లు ఖర్చు చేయాలని లేదంటే ప్రేమించిన యువకుడితో లేచిపోతానని బెదిరించింది. తల్లిదండ్రులే 40వేల డాలర్లు ఖర్చు చేస్తామని చెప్పి ఇప్పుడు దానిని సగానికి తగ్గించడం తగదని తన గోడును సోషల్ మీడియాలో వెల్లబోసుకుంది.