మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ... చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది.
Marri Rajashekar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. యేసుబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. యేసుబాబు ఫిర్యాదు ప్రకారం “విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్” సంస్థ ద్వారా ఆయన అరుంధతి హాస్పిటల్‌కు సిబ్బంది సమకూర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 40 మంది సిబ్బందిని అందించగా.. అందుకు గాను రూ.50 లక్షలు చెల్లిస్తామని రాజశేఖర్…
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్‌తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తన పేరుతో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాచకొండ కమిషనర్ కు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా తమను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ తెలిపారు.…
Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి ఎంపీగా స్వల్ప తేడాతో ఒడిపోయా అని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
Mallareddy: కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు.
Marri Rajasekhar Reddy: బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ స్థానానికి ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారు కాగా.. తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.