మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్‌తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తన పేరుతో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాచకొండ కమిషనర్ కు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా తమను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ తెలిపారు. వారం రోజుల్లో మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
Read Also: KA Paul: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేనే కారణం..
భార్యా, పిల్లలను చంపేస్తామని బెదిరిస్తున్నారి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో తనకే కాల్ చేసి బెదిరిస్తున్నారని.. టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అంశంపై.. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని రాచకొండ సీపీని కోరారు. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజేశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
Read Also: Praja Darbar: ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయం