Marri Rajashekar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. యేసుబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. యేసుబాబు ఫిర్యాదు ప్రకారం “విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్” సంస్థ ద్వారా ఆయన అరుంధతి హాస్పిటల్‌కు సిబ్బంది సమకూర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 40 మంది సిబ్బందిని అందించగా.. అందుకు గాను రూ.50 లక్షలు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు పలు దఫాల్లో కేవలం రూ.30 లక్షలే చెల్లించారని, మిగిలిన డబ్బుల కోసం పలుమార్లు అడిగినా స్పందించలేదని యేసుబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతను పోలీసులను ఆశ్రయించారు.
Read Also: Kishan Reddy: అంబేద్కర్తో అనుబంధం, సంబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారు..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మర్రి రాజశేఖర్ రెడ్డిపై BNS చట్టం కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. పీఎస్‌లో కేసు నెంబర్ 316/2, 318(4) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసు మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి చెందిన ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుండి ఎమ్మెల్యేగా రాజశేఖర్ రెడ్డి గెలిచారు. కేసు పై మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.