Telangana: ప్రజల క్షేమమే మా ధ్యేయం అనే నినాదంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. తేడా వస్తే ప్రాణాలు తియ్యడానికి కూడా ఆలోచించని మావోయిస్టులను చూస్తే ఎవరైనా భయపడాల్సిదే. ఎందుకంటే వాళ్లకు ఏదైనా తప్పుగా అనిపిస్తే సింపుల్ గా చంపేస్తారు. తెలంగాణలో మావోయిస్టుల మనుగడ దశాబ్దాలుగా కొనసుగుతూనే ఉంది. వీళ్ళకి పేద ప్రజల ఆదరణ కూడా ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఎప్పుడూ జనారణ్యానికి దూరంగా ఉంటారు. కార్యకలాపాలన్నీ అడవుల్లో ఉండే జరుపుతుంటారు మావోయిస్థులు. అయితే తాజాగా సిద్ధిపేటలో మావోయిస్థులు ప్రదర్శించిన పోస్టర్లను కలకలం రేపుతున్నాయి. వివరాలలోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా లోని దుబ్బాక-దుంపలపల్లి మధ్య ఉన్న పిల్లర్ కు సీపీఐ మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లను అతికించారు.
Read also:Lunar Eclipse 2023: ఈ ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా..?
ఈ పోస్టర్ల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా BRS నాయకులకి హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫీయా, భూ కబ్జా లు చేస్తున్నారని.. ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని.. ప్రజల పై బిఆర్ఎస్ నాయకులు పెత్తనం చెలయిస్తున్నారని. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని.. లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవు అంటూ మావోయిస్టులు పోస్టర్ల ద్వారా బిఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీచేశారు. కాగా ఈ పోస్టర్లు ఎవరు అంటించారు అనేది ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్లు అందరి లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో ఎక్కడ ఎవరికీ ఎం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.