Maoists killed: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం జియ్యమ్మ వలస దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ పై ఎస్పీ అమిత్ బర్డర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 5:30 సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది.
బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై గ్జైలో(XYLO) కారును పూర్తిగా దగ్ధం చేసారు. ఈనెల 2 నుండి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.
Maoists :తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పామిడి ఏరియాలో ఉన్న బేస్ క్యాంపు లపై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. గత నాలుగు రోజులు వ్యవధిలో మూడుసార్లు జీడిపల్లి బేస్ క్యాంపై మావోయిస్టులు దాడి చేశారు. గత రాత్రి బేస్ క్యాంప్ పై దాడి చేశారు. మళ్లీ ఆయుధాలను సమకూర్చుకొని ఈ తెల్లవారుజామున కూడా దాడి చేశారు .దీంతో తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దులు…