Maoists :తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పామిడి ఏరియాలో ఉన్న బేస్ క్యాంపు లపై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. గత నాలుగు రోజులు వ్యవధిలో మూడుసార్లు జీడిపల్లి బేస్ క్యాంపై మావోయిస్టులు దాడి చేశారు. గత రాత్రి బేస్ క్యాంప్ పై దాడి చేశారు. మళ్లీ ఆయుధాలను సమకూర్చుకొని ఈ తెల్లవారుజామున కూడా దాడి చేశారు .దీంతో తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దులు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పి ఎల్ జి ఏ 25 సంవత్సరాలు ఏర్పడి సందర్భంగా రజతోత్సవాలను పురస్కరించు కొని పెద్ద ఎత్తున భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేశారు. అయితే వారి దాడులను కూడా తిప్పికొట్టేందుకు భద్రత బలగాలు దాడులను ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Aaditya Thackeray: సమాజ్‌వాదీ నేత ‘‘బీజేపీకి బీ-టీమ్’’..