బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు వర్గాలు తెలిపాయి. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో AK47 తో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అడెల్లు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన వ్యక్తి..
READ MORE: Bengaluru Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత నెల 21న బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దు అబూజ్‌మడ్‌లో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత, కేంద్ర కమిటీ (సీసీ) సభ్యుడు తెంటు లక్ష్మీనర్సింహాచలం(65) ఎలియాస్ గౌతమ్ ఎలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎదురుకాల్పులను బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ధ్రువీకరించారు. అంతలోనే మళ్లీ ఓ కీలక నేత హతమైనట్లు తెలుస్తోంది.