Maoists killed: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం జియ్యమ్మ వలస దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ పై ఎస్పీ అమిత్ బర్డర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 5:30 సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది.. ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్ అనంతరం ఏడు మృతదేహాలు దొరికాయి.. ఇవాళ జరిగిన ఫైర్ లో మావోయిస్టు కీలక సభ్యుడు జోగారావు బాడీ లభ్యమైంది.. రెండు ఏకే 47 వెపన్స్ తో పాటు ఇతర ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి.. గత మూడు రోజుల నుంచి అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్ కౌంటర్లల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు అని ఎస్పీ బర్దర్ వెల్లడించారు.
Read Also: Visakhapatnam: టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం..
ఇక, సెంట్రల్ టీమ్స్ కూడా ఆపరేషన్ లో పాల్గొన్నాయని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ఏపీ టీమ్స్- సెంట్రల్ మిలిటరీ ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.. టెక్ శంకర్ అలియాస్ జోగరావుపై రూ. 20 లక్షలు రివర్డ్ ఉంది.. ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ లో కూడా ఇంతే స్థాయిలో రివార్డు ఉందన్నారు. హిడ్మాపై కోటి 80 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.. గత మూడు రోజులు భారీగా కూంబింగ్ చేశాం.. పోలీసులకు ఎక్కడ డ్యామేజ్ జరగలేదు.. ఛత్తీస్ గఢ్ లో భారీగా మావోయిస్టులను రిక్రూట్మెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో కేవలం ఒకరిద్దరు మినహా మావోయిస్టు మనుగడ పెద్దగా లేదని భావిస్తున్నాం.. మారేడుమిల్లి షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్టు తెలిసింది.. హిడ్మా 28, 29 దాడులు చేశారు.. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. కొంత మందికి సంబంధించిన బంధువులు వచ్చారని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు.