Gold Scam: పార్వతీపురంలో మన్యం జిల్లాలో బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం జరిగింది. గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి బాధితులు పాల్పడారు.
YS Jagan: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నకిలీ ఐపీఎస్‌గా గుర్తించారు.
Manyam district: సినీ రంగం పైన ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఇష్టం ఉన్న పనిని ప్రారంభించాలి ఒక్కసారిగా నేమ్ ఫేమ్ సంపాదించాలి అనుకుని ఓ ప్లాన్ లేకుండా అప్పులు చేస్తేనే ముప్పు. ఇలా సినీ రంగం పైన అవగాహనా లేకుండా అప్పులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పుడు ఆకోవలోకి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ పైన ఓ యువకుడికి ఉన్న ఆసక్తి అతని…
పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రెండుసార్లు వైసీపీ జెండా రెపరెపలాంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలన్నది కేడర్ ఆలోచనగా ఉంటే.. నాయకుల వర్గపోరు ప్రమాద సంకేతాలు ఇస్తోందట. కురుపాం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తోయక జగదీశ్వరిని నియమించినప్పటి నుంచీ పరిస్థితి మారిపోయిందనేది తమ్ముళ్ల మాట. ఇంఛార్జ్ నియామకాన్ని లోకల్ పార్టీ నేతలు లక్ష్మణరావు, సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు. కలిసి పనిచేయడానికి అస్సలు ముందుకు రావడం లేదట. ఇంఛార్జ్ జగదీశ్వరికి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు…