YS Jagan: పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
READ MORE: Weather Alert : తెలంగాణలో నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు
Also Read
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
“చంద్రబాబు.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? 611 మంది చదువుతున్న స్కూళ్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబుగారూ.
పేదల తలరాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాలకోసం వారితో చేతులు కలిపి, క్రమంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బతీశారు. ఇంగ్లిషు మీడియంను, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, 8వ తరగతి వారికి ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్‌ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు.
ఆర్వోప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి.” అని ట్వీట్‌లో మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
READ MORE: INDW Vs PAKW: పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన మ్యాచ్ రిఫరీ!
.@ncbn గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే… pic.twitter.com/Dq0pocjxe6
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025
తాజావార్తలు
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..