Manipur Violence: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ లో మరోసారి సాయుధ మూకలు రెచ్చిపోయాయి. బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించారు. ఇక, నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి కాల్చినట్లు తెలుస్తుంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి ఈ దుండగులు పారిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, మరో ఘటనలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: AUS vs WI: 9 వికెట్లతో హాజిల్‌వుడ్ విజృంభణ.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తైన వెస్టిండీస్!
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
కంగ్పోక్పీ జిల్లాలో రెండు వైరి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కాల్పులకు దారి తీసినట్లు పోలీసులలు తెలిపారు. కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు కంగ్‌చుప్ గ్రామంపై దాడి చేశారు. దీంతో గ్రామస్థులు సైతం ప్రతిదాడులు చేశారని పేర్కొన్నారు. ఇక, వాలంటీర్ మరణం తర్వాత ఇంఫాల్‌లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఇక, కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం నివాసం, రాజ్ భవన్ వరకు మహిళలు ర్యాలీ తీశారు. అయితే, రాజ్ భవన్ కు 300 మీటర్ల దూరంలో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!