మణిపూర్‌లో జరిగిన తాజా దాడుల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం కూడా ఉండే ఛాన్స్ ఉందని ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అనుమానిస్తున్నారు. మణిపూర్ సరిహద్దు పట్టణమైన మోరేలో బుధవారం నాడు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ కమాండోలు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడిన కుకీ మిలింటెంట్లకు మయన్మార్ తీవ్రవాదుల నుంచి సహాయం అందిందని భద్రతా సలహాదారు కుల్దీప్ అనుమానం వ్యక్తం చేశారు. మోరేలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో కమాండో పోస్ట్‌లపై కుకీ మిలిటెంట్లు తెల్లవారు జామున కాల్పులు జరిపారు అని కుల్దీప్ సింగ్ చెప్పుకొచ్చారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, మయన్మార్‌లో జుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్) తిరుగుబాటుదారులు మోరేలో స్థానిక పీడీఎఫ్ సభ్యులతో కలిసి మణిపూర్‌లోని భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉండవచ్చని ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందుకు తగిన ఆధారాలు లేనప్పటికీ.. ఇలా జరిగే అవకాశమూ ఉంటుందని చెప్పారు.