Bharat Nyay Yatra: మణిపూర్ లో భారత్ న్యాయ్ యాత్రకు నో పర్మిషన్.. కేసీ వేణుగోపాల్ రియాక్షన్ ఇదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KC Venugopal: మణిపూర్ నుంచి జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ మణిపూర్ సర్కార్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. భారత్ జోడో న్యాయ్ యాత్రకు ప్రారంభ వేదికకు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వారం రోజుల క్రితం అనుమతి కోసం చీఫ్ సెక్రటరీకి లేఖ ఇచ్చారు.. ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడే ఆయనను కలవడానికి వెళ్లారు.. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వడం లేదని ఈరోజు సమాచారం వచ్చింది అని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Also Read
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ఇవాళ ఉదయం కాంగ్రెస్ కు చెందిన మణిపూర్ మాజీ సీఎం ప్రస్తుత ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లి అభ్యర్థించారు.. కానీ ఆయన నిరాకరించారు అని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మేం ఎలాంటి డ్రామా సృష్టించడం లేదు.. ఈ యాత్ర దేశం కోసమే.. ప్యాలెస్ గ్రౌండ్ ఇవ్వకుంటే ఇబ్బంది లేదు, మరో స్థలాన్ని ఎంచుకుంటాం, ఈ విషయమై అక్కడి సీఎంతో కూడా మాట్లాడాం.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇంఫాల్ నుంచే ప్రారంభమవుతుంది.. రేపటిలోగా అందరికీ కొత్త ప్రదేశానికి సంబంధించిన సమాచారం అందజేస్తాం అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!