Manipur :మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..
- తౌబల్ జిల్లాలోని వైథౌ రిడ్జ్ ప్రాంతంలో ఆయుధాలు
- మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం
- సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన అస్సాం రైఫిల్స్.. మణిపూర్ పోలీసులు
- ఒక 12 బోర్ సింగిల్ బ్యారెల్ గన్.. ఒక 12 బోర్ బోల్ట్ యాక్షన్ రైఫిల్ సహా పలు ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం రైఫిల్స్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం.. ఆపరేషన్ లో భద్రతాదళాలు ఒక 12 బోర్ సింగిల్ బ్యారెల్ గన్, ఒక 12 బోర్ బోల్ట్ యాక్షన్ రైఫిల్, ఒక 9 mm CMG, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నాయి.
READ MORE: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ లు బంద్..!
Also Read
అల్లర్లు, హింసతో రగులుతున్న మణిపూర్ లో భద్రతా దళాలు మరో పురోగతి సాధించాయి. భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలోని వైథౌ రిడ్జ్ ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉనికికి సంబంధించి నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆపరేషన్ ప్రారంభించారు. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను మణిపూర్ పోలీసులకు అప్పగించినట్లు ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, మణిపూర్ పోలీసులు శుక్రవారం తెంగ్నౌపాల్ జిల్లాలోని లామ్‌లాంగ్ గ్రామ సమీపంలోని శాంటాంగ్ నుంచి ముగ్గురు తిరుగుబాటుదారులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కేవైకేఎల్ (KYKL) గ్రూప్‌కు చెందిన థియామ్ లుఖోయ్ లువాంగ్ (21), కాషమ్ ప్రేమ్‌చంద్ సింగ్ (24), కేసీపీ (KCP) నోయాన్ గ్రూప్‌కు చెందిన ఇనావోబీ ఖుండ్రక్‌పామ్ (20) ఉన్నారు.
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!