మణిపూర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో.. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Read Also: Tamannaah : అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పేంటి.. నటిగా అది నాకు అవసరం..
భూకంప కేంద్రం అక్షాంశం 23.9 N, రేఖాంశం 94.10 E, 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు NCS పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున 2:28 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భూకంప ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే భూకంప తీవ్రత స్వల్పంగానే ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.
Read Also: Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారీ సెర్చింగ్ నిర్వహిస్తున్న భద్రతాదళాలు