Manipur : మణిపూర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. వీరిద్దరూ 128వ బెటాలియన్‌కు చెందినవారు. ఈ ఘటన నరసేన ప్రాంతంలో చోటుచేసుకుంది. కుకీ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మణిపూర్‌లోని నరన్‌సేన ప్రాంతంలో తెల్లవారుజామున 2:15 గంటల మధ్య కుకీ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోయారని మణిపూర్ పోలీసులు ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. ఈ సైనికులు రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన ప్రాంతంలో మోహరించిన CRPF 128వ బెటాలియన్‌కు చెందినవారు.
Read Also:YSRCP Manifesto 2024: నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్ వెర్షన్..!
Two Central Reserve Police Force (CRPF) personnel lost their lives in an attack by Kuki militants starting from midnight till 2:15 am at Naransena area in Manipur. The personnel are from CRPF's 128 Battalion deployed at Naransena area in Bishnupur district in the state: Manipur…
— ANI (@ANI) April 27, 2024
Read Also:Arvind Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన కుల హింస అంతం కావడం లేదు. దాదాపు ఏడాది కాలంగా చెదురుమదురు హింసాకాండలో మణిపూర్ రగిలిపోతోంది. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రజలు వలస వెళ్ళవలసి వచ్చింది. మే 2023లో మణిపూర్‌లో హింస ప్రారంభమైంది. అప్పటి నుంచి కాల్పులు, హింస వంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.