Rahul gandi: ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి
- ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి
- మణిపూర్‌ను సందర్శించాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని మోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానికి రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మణిపూర్ పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో రాహుల్ షేర్ చేశారు. భద్రత విషయంలో ఆందోళన, ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తమ ముఖాలను చూపొద్దని వారు విజ్ఞప్తి చేశారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇది రైలు కాదు గురూ.. ఇల్లు (వీడియో)
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
గతేడాది మేలో మణిపూర్‌లోని కుకీ, మెయితీ జాతుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 200 మందికిపైగా మరణించారు. ఈ ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ మూడు సార్లు పర్యటించారు. జులైలో సైతం రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంఫాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ చాలా కాలం క్రితం మణిపూర్‌లో పర్యటించారన్నారు. మరోసారి ఈ రాష్ట్రంలో పర్యటించి.. మణిపూర్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. మణిపూర్ ప్రజలే కాదు.. దేశ ప్రజలంతా ఆ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించాలని కోరుకుంటున్నారని తెలిపారు. అలా పర్యటించడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజల భావాలను ప్రధాని మోడీ తెలుసుకుంటారనే భావన వారిలో వ్యక్తమవుతుందని చెప్పారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని ప్రధాని మోడీకి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Today, I met with a group of Manipuri people living in Delhi who shared their heartbreaking struggles since the onset of the conflict in their region. They spoke of the pain of being separated from loved ones and the physical and mental toll the conflict has taken on their… pic.twitter.com/VuO1azgqaz
— Rahul Gandhi (@RahulGandhi) August 15, 2024
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!