Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్‌లో, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో ఎనిమిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లను (ఐఇడి) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది. బాంబు నిర్వీర్య బృందంతో పాటు ఆర్మీ బృందం వేగంగా పని చేసి 33 కిలోల బరువున్న ఐఈడీని నిర్వీర్యం చేసింది. సైన్యం, పోలీసుల ఈ సత్వర చర్య భద్రతా దళాలు, ఇతర ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకున్న ప్లాన్ ను పటాపంచలు చేసింది. ఈ ప్రాంతాన్ని ఇంఫాల్ తూర్పులోని మొయిరంగ్‌పురేల్, ఇథమ్ గ్రామాలలో రైతులు, పశువుల కాపరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ చర్యతో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల దుశ్చర్యలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్
శుక్రవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లా చానుంగ్ టాప్‌లో సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం, మణిపూర్ పోలీసులు జూలై 17న కాంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల నుండి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆయుధాలను విచారణ నిమిత్తం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.
Read Also:Nipah Virus: కేరళలో నిపా కలకలం.. 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్..
ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
జూన్‌లో కూడా ఇంఫాల్ తూర్పు, బిష్ణుపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలు భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో 11 గ్రెనేడ్లు, 6 ఐఈడీలు, ఐదు 303 రైఫిళ్లు, 3 డిటోనేటర్లు, 1 కార్బైన్, 1 హ్యాండ్‌గన్, వివిధ రకాల బాంబులు, మందుగుండు సామగ్రితో పాటు నాలుగు వాకీటాకీలు, రెండు రేడియో సెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లా లోయ ప్రాంతంలో ఉండగా, బిష్ణుపూర్ జిల్లాలో కొంత భాగం కొండల్లో ఉందని పోలీసులు తెలిపారు.