BJP Leader sushil modi comments on cm nitish kumar: బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. బీహార్ పొత్తు వదులకున్న తర్వాత నుంచి సుశీల్ మోదీ, నితీష్ కుమార్ పై వరసగా విమర్శలు చేస్తున్నారు. నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. ఆర్జేడీ పార్టీ బీహార్ లో జేడీయూ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలో…
మణిపూర్‌లో ప్రభుత్వం 5 రోజుల పాటు మొబైల్ డేటా సేవలను నిలిపివేసింది. మణిపూర్ అంతటా మొబైల్ డేటా సేవలను ఐదు రోజుల పాటు నిలిపివేసినట్లు ప్రత్యేక కార్యదర్శి (హోమ్) హెచ్ జ్ఞాన్ ప్రకాష్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.
మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలు ఉండేలా కొత్త జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మణిపూర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9…
మణిపూర్ సీఎంగా బీరెన్‌సింగ్ సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ గణేశన్ ప్రమాణం చేయించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంఫాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ హాజరయ్యారు. హెయ్‌గాంగ్ నియోజకవర్గం నుంచి బీరెన్ సింగ్ 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీరెన్‌సింగ్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా రెండోసారి మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రమాణస్వీకారం చేసిన…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తొందరపడటం లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఒక్క సీటు తక్కువైనా.. మద్దతు ఇచ్చేందుకు స్వతంత్రులు, ఎంజీపీ రెడీగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మాత్రం.. చాలా కసరత్తే చేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ కోసం ఎంత వర్కవుట్ చేశారో..…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా…
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడించారు.. ఈ ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్‌షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది.. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఇక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి..…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు,…
ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే…